Wednesday, November 24, 2010

శాస్త్రజ్ఞుల జీవితచరిత్రలు


మనవాభ్యుదయం కోసం, సమాజ సౌభాగ్యం కోసం అనేక మంది మహాపురుషులు ఎన్నో విషయాలను కనుగొన్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసారు. ఎన్నో సూక్తులు భోదించారు. ఈ నాటికి అవే మనకు మార్గదర్శకంగా నిలిచాయి.
               ఈ  కోవకు చెందినా 25 మందికిపైగా శాస్త్రవేత్తలు జీవిత చరిత్రలను, వారు కనుగొన్న విషయాలను, మనసుకు హత్తుకునేట్లుగా ఈ సంకలనంలో పొందుపరచారు శ్రీ యెస్.బాలకృష్ణముర్తి గారు. ఇందులో నోబెల్ బహుమతి పొందిన వారూ వున్నారు.
శాస్త్రజ్ఞుల జీవితచరిత్రలు      Rs.100/-

Monday, November 22, 2010

విజ్ఞాన ప్రశ్నావళి


కాంతి సంవత్సరం అంటే ఏమిటి? విశ్వం ఎలా ఏర్పడింది? ఆకాశం నీలంగా ఎందుకు వుంటుంది? తుఫాన్లు ఎలా వస్తాయి? ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు ఖగోళ, భూగోళ, శరీర ధర్మశాస్త్రాలనే 4 శీర్షికలక్రింద 250 ప్రశ్నలకు సమాధానాల రూపంలో తేటతెల్లంగా వివరించారు శ్రీ పి.వి.కె.ప్రసాదరావు M.A(His.), M.A.(Eng.), M.A.(Tel.),  M.A.(Soc.), M.A.(Pub. Admin.).

విజ్ఞాన ప్రశ్నావళి                    Rs.60/-

శ్రీ మహాలక్ష్మి పెద్దబాలశిక్ష


ప్రస్తుతం ఆంధ్రదేశంలో ఎన్నో పెద్దబాలశిక్షలు ప్రచురణ అయి వాడుకలో ఉన్నాయి. ఏతరహాలో రూపొందించిన అందరి ధ్యేయం ఒక్కటే! అది బాలల మనోవికాసం. శ్రీ మహాలక్ష్మి పెద్దబాలశిక్ష పాత కొత్తల మేలు బంతి. సాంప్రదాయ సంస్కార విషయాలు, చిరకాలంగా మన పెద్దలు మనకు భోదిస్తూవచ్చిన సంస్కృతి విషయాలతో బాటు ఆధునిక అంశాలేన్నిటినో ఈ పెద్దబాలశిక్షలో పొందుపరిచారు శ్రీ యు.కె. విశ్వమోహన్, B.Sc.,

శ్రీ మహాలక్ష్మి పెద్దబాలశిక్ష      Rs.116/-

Friday, November 19, 2010

నవీన వ్యాసాలు


వైద్యరంగం, వైజ్ఞానికరంగం, విద్యారంగం, మానవుడు-అలవాట్లు, దేశసమస్యలు, ప్రజా సౌకర్యములు, రైతులు-సమస్యలు, ప్రచారసాధనములు, పౌరులు-బాధ్యతలు, ప్రభుత్వంగాములు, అంతర్జాతీయరంగం వంటి పదకొండు రంగాల గురించి (పదకొండు x పది = నూటపది) వ్యాసాలు విద్యార్ధిని విద్యార్ధులకు గాను ఏర్చి కూర్చారు శ్రీ ధర్మవరపు బుచ్చిపాపరాజు గారు.

నవీన వ్యాసాలు (Standard Essays) Rs.100/-

క్రొత్త సంగీత విద్యదర్పణము


సర్టిఫికేట్, డిప్లమో మొదలగు గవర్నమెంట్ ఎగ్జామ్స్ సిలబస్లను గురించి, కర్ణాటక సంగీతమభ్యసించు విద్యార్దిని విద్యార్ధుల ఉపయోగార్ధం శ్రీ ఏకసుబ్బారావు గారిచే సమకుర్చబడినది ఈ ప్రామాణిక గ్రంథం
.

క్రొత్త సంగీత విద్యదర్పణము            Rs.300/-

Wednesday, November 17, 2010

సంఖ్యావాచక పదకోశము


ఈ నిఘంటువు పేరు సంఖ్యా వాచక పదకోశము. అంటే సంఖ్యావాచక పదాలకి వివరణ ఇచ్చేది, ఉదా: అగ్నులు-3, పాండవులు-5, ఋషులు-7, అష్టైశ్వర్యాలు-8, అష్టకష్టాలు-8, నవరత్నాలు-9, నవరసాలు-9, అష్టాదశపురాణాలు-18, ....... చతుషష్టికళలు-64, కౌరవులు-100..... అనటాన్ని మనం వింటుంటాం కానీ అవి ఏమిటి అనేది మనకు తెలియదు. 'అష్టకష్టాలు పడుతున్నడురా' అంటాం. వాడు అష్టైశ్వర్యాలతో తులతూగుతున్నాడంటాం, అవీ మనకు తెలియవు. అవీ ఏమిటన్నది చెప్పేది ఈ సంఖ్యావాచక పదకోశం, సంఖ్యాపరంగా సమగ్రమైన ఇట్టి గ్రంధము ఇంతవరకు
వేలువడియుండలేదు.

                                     ఇందులో ఏక(1) సంఖ్యలో మొదలై అష్టోత్తరశత(108) సంఖ్యా వరకు వచ్చు పదాలకు వివరణలను ఎంతో వ్యయప్రయాసలకోర్చి తీర్చిదిద్దారు బి.అనంతరావు గారు. గ్రంథలు చదివే వారికే కాక విద్యార్ధులకు, పరిశోధకులకు, ఆయుర్వేద, సాహిత్య వేదాంత విషయాలను అభ్యసించే వారికి ఇది ఒక కరదీపిక. 
సంఖ్యావాచక పదకోశము                                        Rs.300/-

శ్రీ ఈశావాస్యోపనిషత్


ఉపనిషత్తులు శృతి శిరములని చెప్పబడ్డాయి. కాబట్టి ఉపనిషత్తులను అధ్యయనం చేస్తే వేదసారం మనకు అందుతుంది. అలంటి ఉపనిషత్తులలో మొదటిది శ్రీ
ఈశావాస్యోపనిత్, శ్రీ ప్రేమ్ సిద్దార్ధ గారు 'మా' టివిలో చేసిన దివ్య ప్రసంగాలు పండిత పామర జన హృదయ రంజకములై ఎందరినో ఆకట్టుకున్నాయి. ఆప్రసంగాలు పుస్తకరూపంలో మీకందిస్తున్నం చదవండి!
శ్రీ ఈశావాస్యోపనిత్     Rs.100/- 

Sunday, November 7, 2010

భజగోవిందం మూడమతే


పురాణాలు, కావ్యాలు, వేదాలు, ఉపనిషత్తులు సారం మొత్తం ఈ 32 భజగోవింద శ్లోకాల్లో నిక్షిప్తం చేసారు ఆది శంకరులు. ఈ శ్లోకాలకు తనదైన శైలిలో అందరికీ అర్ధమయ్యే విధంగా వ్యాఖ్యానించారు శ్రీ ప్రేమ్ సిద్దార్ధ గారు. దానిని యధాతధంగా మీ ముందుంచుతున్నాం.

భజగోవిందం మూడమతే       Rs.125/-

Saturday, November 6, 2010

భగవాన్ శ్రీరమణ మహర్షి ఉపదేశసారము

LEARN STANDARD ENGLISH GRAMMAR IN 60 DAYS


                    English Grammar is very much essential for every student in their carrier aspect which is helpful to gain a minimum of 5% marks more than others, and the weightage for English Grammar in the competitive exams now a days is well known.

                       Such an important Grammar is flexibly divided in to a 60day course in a self explanatory manner by Mr.P.V.K.Prasada Rao  M.A.(Eng.), M.A.(Tel.), M.A.(His.), M.A.(Soc.), M.A.(Pub. Admin.).

LEARN STANDARD ENGLISH GRAMMAR IN 60 DAYS Rs.140/-

తెలుగు వ్యాకరణ చంద్రిక


 
స్వంతంగా చదివి అర్ధం చేసుకొనేల విద్యార్ధుల వుపయోగార్ధమై తేట తెలుగులో వ్రయించబడిన ఈ శాస్త్రీయ గ్రంధం శ్రీ పి.వి.కె.ప్రసాదరావు, M.A.(Tel.), M.A.(Eng.), M.A.(His.), M.A.(Soc.), M.A.(Pub. Admin.) రచన.
తెలుగు వ్యాకరణ చంద్రిక                     Rs.110/-

Friday, November 5, 2010

పండుగలు-ప్రాముఖ్యత


నేటి యువత క్లబ్బులు, పబ్బులు, డిస్కోటెక్ల మోజులో పడి మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతి రూపాలైన పండుగలు వాటి ప్రాముఖ్యత, తెర మరుగున పడిపోబోతున్న ఈ తరుణంలో పండుగల గురించి వివరిస్తూ తనదైనశైలిలో పండుగ వాతావరణాన్ని, సంభ్రమాలని, సంతోషాలని, వ్యక్తుల మధ్య, కుటుంబసభ్యుల మధ్య సజీవంగా చిత్రీకరించారు ఈ పుస్తకంలో శ్రీ దేవరకొండ మురళీకృష్ణ. 
పండుగలు-ప్రాముఖ్యత        Rs.100/-