Sunday, September 5, 2010

నామచంద్రికలు (పిల్లల పేర్లు)


ఆంధ్రప్రదేశ్ లో  ప్రజాభిమానం గల రచయత్రి, నవ నవలాకారిణి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి పిల్లలకోసం ప్రత్యేకంగా శ్రమించి యేర్చి కూర్చిన అద్భుత పిల్లలపేర్ల మణిహారాన్ని మీ ముందుంచుతున్నాం. వెన్నెల నవ్వులు విరబూయించే, మీ ముద్దుల బిడ్డకు ఈ పుస్తకంలోంచి వో నామచంద్రికను (పేరు) ఎంచుకోండి. దీనిలో పిల్లల పెర్లతోబాటు ఇంకా గర్భిణులకు సూచనలు, ప్రసవతేది ఎలా నిర్ణయిస్తారు; వుండాల్సిన ఎత్తు-బరువులు, తల్లిపాలు, ఆహారనియమాలు, ఉపయోగకరమైన టీకాల వివరాలు, పిల్లల కోసం పొదుపు పధకాలు ఇలా ఎన్నో అంశాలు ప్రత్యేకంగా పొందుపరిచారు రచయిత్రి ఈ పుస్తకంలో.
నామచంద్రికలు (పిల్లల పేర్లు)                                        Rs.35/-

శతక సముచ్చయము

తెలుగు నాట అత్యంత ప్రాచుర్యం పొందినవి సుమతీ, వేమన, కుమార, కుమారీ శతకములు . వీటిలో మనిషి విధిగా తెలుసుకోవలసిన, మరియు ఆచరించవలసిన ఎన్నో విషయాలు పొందు పరిచారు మన పండితోత్తములు. వీటిలో పొందు పరచబడ్డ విషయాలు పెద్దలకు పిన్నలకు సంబంధించినవేకాక సామాజిక కట్టుబాట్లు గురించి కూడా స్ప్రుసిస్తాయి. ఫై నాలుగు శతకాలు మొక్కపాటి శర్మ ఎం.ఎ, గారి వ్యాఖ్యానంలో   టీకా మరియు తాత్పర్యముతో మీ ముందుంచుతున్నాం.
శతక సముచ్చయము      Rs.70/-